మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Aug 18, 2020 , 02:26:57

శాంతించిన వరుణుడు

శాంతించిన వరుణుడు

వికారాబాద్‌: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సోమవారం సాయంత్రానికి పూర్తిగా తగ్గుముఖం పట్టడం నియోజకవర్గ ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నియోజకవర్గంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మర్పల్లి మండలంలో 27.4మి.మీ వర్షపాతం నమోదు కాగా.. వికారాబాద్‌ లో 19.4మి.మీ, మోమిన్‌పేట్‌ 25.2మి.మీ, నవాబుపేట 23.4మి.మీ, ధారూరు 12.8మి.మీ, బంట్వారంలో 21మి.మీ నమోదైంది. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. దీంతో నియోజకవర్గంలోని చెరువులు నిండుకుండల్లా మారాయి.  కోట్‌పల్లి ప్రాజె క్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి అలుగుపోస్తున్నది. అనంతగిరి కొండలపై నుంచి వర్షపు నీరు కిందికి ప్రవహించడం అందరినీ ఆకట్టుకుంటున్నది. వర్షం పూర్తిగా తగ్గడంతో కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకుల సందడి నెలకొంది. అధికారులు లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంతెనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన కుండా వ్యవసాయాధికారులు రైతులకు సూచనలు అందిస్తున్నారు.   

  అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్‌: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. సోమవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు మునిగిపోయా యని, ఇండ్లు కూలిపోయాయన్నారు.   సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ లు, జడ్పీటీసీలు, మున్సి పాలిటీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు, అధికారులందరూ అప్రమత్తం కావాలన్నారు. కూలిపోయిన ఇండ్లను, నష్ట పోయిన పంటలను గుర్తించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామా ల్లోని వార్డుల్లో శానిటేషన్‌ పనులు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని సూచించారు. కావాల్సిన సహాయం కోసం ప్రభుత్వం కలెక్టరేట్‌ లో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటుచేసిందన్నారు. logo