ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Aug 16, 2020 , 00:09:36

‘స్వచ్ఛత’ అందరి బాధ్యత

‘స్వచ్ఛత’ అందరి బాధ్యత

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 

షాద్‌నగర్‌టౌన్‌ : షాద్‌నగర్‌ స్వచ్ఛత అందరి బాధ్యతని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. శనివారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని వినాయకగంజ్‌ వద్ద గతంలో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లను మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, కమిషనర్‌ లావణ్య, కౌన్సిలర్‌ కొందూటి మహేశ్వరితో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక గంజ్‌ వద్ద శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లను మున్సిపల్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేసి రంగులు వేయించినట్లు తెలిపారు. ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయరాదన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సింహ, సర్వర్‌, అంతయ్య, వెంకట్రాంరెడ్డి, కౌసల్య, మహిళా శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్‌ రాజ్యలక్ష్మి, నాయకులు నర్సింహులు, యాదగిరి పాల్గొన్నారు.

సకల జీవకోటికి ప్రాణాధారం మొక్కలు

సకల జీవకోటికి ప్రాణాధారం మొక్కలని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్‌ పట్టణ ముఖ్యకూడలి పరిగి రోడ్డు డివైడర్‌ మధ్యలో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌తో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. హరితహారంలో మనం నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్లతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతోపాటు అడుగంటిన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. మనం నాటే ప్రతి మొక్క భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య, కమిషనర్‌ లావణ్య, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహ, ప్రతాప్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌, సర్వర్‌పాషా, అంతయ్య, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, గౌస్‌, కొందూటి మహేశ్వరి, జూపల్లి కౌసల్య, పావని, శ్రావణి, సరిత, మానస, కో ఆప్షన్‌ సభ్యులు ఒగ్గు కిషోర్‌, పద్మ, గౌస్‌జానీ, మాజీ చైర్మన్‌ విశ్వం, మహిళా శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్‌ రాజ్యలక్ష్మి, నాయకులు యుగేందర్‌, శంకర్‌, యాదగిరి, కిశోర్‌, నర్సింహులు, పాండురంగారెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు.


logo