మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 15, 2020 , 01:13:16

సీఎంఆర్‌ఎఫ్‌తో కార్పొరేట్‌ వైద్యం

సీఎంఆర్‌ఎఫ్‌తో కార్పొరేట్‌ వైద్యం

పరిగి : పేదలకు వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలోని తన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.29.36 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం అందజేస్తూ, వారికి అండగా నిలుస్తున్నదని తెలిపారు. దీంతోపాటు సర్కారు దవాఖానలను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని అన్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సాయం అందుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌, రైతుబంధు సమితి పరిగి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్‌, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్‌, కౌన్సిలర్‌ వారాల రవీంద్ర, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆకారపు రాజు, బిల్లపాటి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు


logo