బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 14, 2020 , 03:19:14

విస్తారంగా.. వర్షం

విస్తారంగా.. వర్షం

  • నిండుకుండల్లా చెరువులు, కుంటలు, వాగులు
  • కళకళలాడుతున్న కోట్‌పల్లి ప్రాజెక్టు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నది. పొలాల్లోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాని కొన్నిచోట్ల ముసురు పడటంతో నీరు నిలిచి పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పంట నష్టం జరుగలేదని, అయితే వరి సాగు పెరుగడానికి అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి.  పలు వీధులు బురదమయంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులుపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో 385.2మి.మీల వర్షం కురువాల్సి ఉండగా 394.7మి.మీల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో అత్యధికంగా, 6 మండలాల్లో సాధారణంగా, రెండు మండలాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక వికారాబాద్‌ జిల్లాలో రెండు రోజులు కురుస్తున్న వర్షంతో అత్యధికంగా తాండూరులో 16.2మి.మీ, అత్యల్పంగా బొంరాస్‌పేటలో 2మి.మీ వర్షపాతం నమోదైంది. 


తాజావార్తలు


logo