సోమవారం 28 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 14, 2020 , 03:19:12

పర్యాటకం @ లఖ్నాపూర్‌

పర్యాటకం @ లఖ్నాపూర్‌

జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో లఖ్నాపూర్‌ ఒకటి. పరిగి మండల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు సాగునీరు మాత్రమే అందిస్తుండగా, త్వరలో పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 304 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడంతో పాటు మినీట్యాంక్‌ బండ్‌గా మార్చేందుకు రూ.6.81 కోట్లు కేటాయించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారగా, యాసంగి పంటకు నీరందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు ట్యాంక్‌బండ్‌ పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు కట్ట వెడల్పును 3 మీటర్ల నుంచి 8 మీటర్లకు పెంచగా, గణేశ్‌ ఘాట్‌, బతుకమ్మ ఘాట్‌ పనులు పూర్తి కావచ్చాయి. బోటింగ్‌ కోసం ప్రత్యేకంగా జెట్టి ప్లాట్‌ ఫారం, లైటింగ్‌ సిస్టం, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తవగా, దసరా నాటికి మొత్తం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సర్కారు నిర్ణయంతో త్వరలోనే ఈ ప్రాంతానికి ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - పరిగి

 పరిగి: ఓవైపు సాగుకు నీరు అందించడం.. మరోవైపు ప్రజ లకు ఆహ్లాదం పంచేందుకు లఖ్నాపూర్‌ ప్రాజెక్టు సిద్ధమవు తున్నది. నాలుగు దశాబ్దాలుగా కేవలం సాగునీటి ప్రాజెక్టు గానే ఉన్న లఖ్నాపూర్‌ను రూ.6.81కోట్లతో పునరుద్ధరణ, మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులు జోరుగా జరుగుతు న్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రాజెక్టు నీటి నిలువ సామ ర్థ్యం పెరుగడం.. అలాగే, ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారనున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,647 ఎక రాలకు సాగునీరు అందుతున్నది. ప్రాజెక్టు పరిధిలో యా సంగి పంటకు నీరు అందించేందుకు ఓవైపు ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోవైపు ప్రజలకు చక్కటి ఆహ్లాదకర మైన వాతావరణం అందించే విధంగా మినీ ట్యాంక్‌బండ్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమా రు 80శాతం పనులు పూర్తవగా దసరా నాటికి మొత్తం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  యాసంగి పంటలకు సాగునీరు...

 పరిగి మండల పరిధిలోని లఖ్నాపూర్‌ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటలకు సాగునీరు అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎ ప్పుడూ లేనివిధంగా ఆగస్టు నెలలోనే ప్రాజె క్టులోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగినప్పటికీ మరో మూడు అడుగుల నీ రువస్తే అలుగు పారుతుంది. ప్రాజెక్టు 304 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల నీటి సామర్థ్యం క లిగి ఉన్నది.ఈ ప్రాజెక్టు రెండు కాలువల ద్వారా మోమిన్‌కలాన్‌, రాజాపూర్‌, నాగా రం, లఖ్నాపూర్‌, మిట్టకోడూర్‌, ఐనాపూర్‌ గ్రామాల పరిధిలోని 2,647 ఎకరాలకు సా గునీరు అందుతున్నది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందా అని ఎదురుచూసే పరిస్థితి ఉండగా, ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రాజెక్టులోకి నీరు చేరింది. ఇప్పటికే వానకాలంలో ప్రాజెక్టు కింద భూము లలో వర్షాధార పంటలు సాగు చేశారు.యాసంగిలో పూర్తి స్థాయిలో రెండు కాలువల కింద సాగునీరు అందనున్నది.

   మినీ ట్యాంక్‌బండ్‌, పునరుద్ధరణ పనులు..

 లఖ్నాపూర్‌ ప్రాజెక్టును మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేసే పనులు దసరా నాటికి పూర్తి చేసేందుకు పనులు వేగ వంతంగా కొనసాగుతున్నాయి. లఖ్నాపూర్‌ ప్రాజెక్టు పున రుద్ధరణకు మొదటి దశలో రూ.2.26కోట్లు మంజూర య్యాయి. ఈ నిధులతో పూడికతీతతో పాటు సుమారు 1200 మీటర్ల మేర కాలువల నిర్మాణం పూర్తి చేశారు. టీఆ ర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించడంతో అం దులో భాగంగా మరో రూ.4.55కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.6.81కోట్లతో పనులు సాగుతున్నాయి. ఇప్పటి కే ప్రాజెక్టు కట్ట వెడల్పును 3మీటర్ల నుంచి 8మీటర్లకు పెం చారు. ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం గణేశ్‌ ఘాట్‌, బతుకమ్మల నిమజ్జనం కోసం బతుక మ్మల ఘాట్‌ పనులు పూర్తి కావచ్చాయి. ప్రాజెక్టులో బోటిం గ్‌ కోసం ప్రత్యేకంగా జెట్టి ప్లాట్‌ ఫారం నిర్మిస్తున్నారు. కట్టపై వాకర్స్‌ కోసం 260 మీటర్ల మేర వాకింగ్‌ ట్రాక్‌ పనులు జరిగాయి. వీటికోసం సుమారు రూ.4.5కోట్లు ఖర్చు పెట్ట నున్నారు. మిగతా పనులకు సంబంధించి కట్టకు మరోవైపు వాకింగ్‌ ట్రాక్‌, కట్టపై పూర్తిగా పారాఫీట్‌ వాల్‌, రెయిలింగ్‌, ఇతర పనులు చేపట్టాల్సి ఉన్నది. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత లఖ్నాపూర్‌ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా మా రనుంది. ఉదయం సమయంలో చక్కటి వాతావరణంలో వాకింగ్‌ చేసేందుకు, సాయంత్రం సమయంలో స్థానికులు, పర్యాటకులు సేద తీరవచ్చు. కట్టపై ప్రత్యేకంగా లైటింగ్‌ సైతం ఏర్పాటు చేస్తుండడంతో సాయంత్రం సమయంలో ఈ ప్రాజెక్టు మరింత అందంగా కనువిందు చేయనుంది.


logo