ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 11, 2020 , 00:35:09

కులకచర్లలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కులకచర్లలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కులకచర్ల: కరోనా బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు దుకాణాలు కొంత సమయం తెరిచి లాక్‌డౌన్‌ నిర్వహించాలని మండల కేంద్రంలో దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి దుకాణాన్ని మూసివేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు సర్పంచ్‌ సౌమ్యారెడ్డి తెలిపారు. వ్యాపారస్తులు నిర్ణయించిన మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించి, మిగతా సమయంలో బంద్‌ ఉంచుతారని అన్నారు. ఈ నెల 31వరకు దీన్ని కొనసాగించేందుకు నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 


logo