ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 11, 2020 , 00:28:18

కల్యాణలక్ష్మి అడబిడ్డలకు వరం

కల్యాణలక్ష్మి అడబిడ్డలకు వరం

- ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పూడూరు: నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 13 మందికి కల్యాణలక్ష్మి, 10 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్ల వివాహాలు జరిపించడంలేదన్నారు. హరితహారం ద్వారా ప్రతి పంచాయతీలో మొక్కలు నాటడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, సర్పంచ్‌ నవ్యారెడ్డి, ఉప సర్పంచ్‌ రాజేందర్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి, తాసిల్దార్‌ దీపక్‌, ఎంపీడీవో ఉష, లబ్ధిదారులు పాల్గొన్నారు.


logo