బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 10, 2020 , 00:17:42

కులకచర్లలో మళ్లీ లాక్‌డౌన్‌

కులకచర్లలో మళ్లీ లాక్‌డౌన్‌

  • నేటి నుంచి ప్రారంభం

కులకచర్ల : మండల కేంద్రంలో మరో మారు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు కులకచర్ల గ్రామ సర్పంచ్‌ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దుకాణాల యజమానులు గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని, కరోనా నివారించేందుకు ఇదొక్కటే మార్గమని తెలియజేయడంతో కులకచర్లలో ఈ నెల 10 నుంచి 31వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 12వరకు దుకాణాలు తెరువాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు. మెడికల్‌ దుకాణాల్లో కేవలం మెడికల్‌కు సంబంధించినవి మాత్రమే విక్రయించాల్సి ఉండగా కొన్ని మెడికల్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులతో పాటు, స్టేషనరీ, మిగితా సామగ్రిని విక్రయిస్తున్నారని తెలిపారు. గతంలో నిర్వహించిన లాక్‌డౌన్‌లో ఇలాగే చేయడం వలన నష్టపోయామని పలువురు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా గ్రామ పంచాయతీ దృష్టిలో పెట్టుకొని తమకు నష్టం కలుగకుండా ఉండేందుకు మెడికల్‌ దుకాణాల్లో మెడికల్‌కు సంబంధించినవి కాకుండా ఇతర వస్తువులు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము లాక్‌డౌన్‌కు సహకరించబోమని తెలిపారు.


తాజావార్తలు


logo