బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 10, 2020 , 00:01:51

రైతు వేదికలను 15కల్లా పూర్తి చేయాలి

రైతు వేదికలను 15కల్లా పూర్తి చేయాలి

  • పల్లె ప్రకృతి వనాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు
  • బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డి పల్లిలో పర్యటన
  • మొక్కల పరిశీలన.. అధికారులకు సూచనలు

బొంరాస్‌పేట : రైతు వేదిక భవనాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. రైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం చాలా బాగుందని.. జిల్లాలోనే ఇది ఆదర్శంగా ఉండాలని సూచించారు. ప్రకృతి వనం అంతటా కలియతిరిగి పలు చోట్ల వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. వనంలో చేపట్టాల్సిన పనులను అధికారులకు వివరించారు. ఎత్తయిన ప్రాంతంలో ప్రకృతివనం ఉందని, చుట్టూ పచ్చదనం బాగా ఉన్నందున చూసేవారికి ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందన్నారు. అదనంగా నిధులు కూడా మంజూరు చేస్తానని.. బాగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలను పరిశీలించి ఏఏ రకం మొక్కలు నాటారో అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు.  కార్యక్రమంలో ఎంపీడీవో హరినందనరావు, తహసిల్దార్‌ షాహెదాబేగం, పీఆర్‌ డీఈ ఉమేశ్‌కుమార్‌, ఏవో రాజేశ్‌, ఏపీవో రజనీకాంత్‌, సర్పంచ్‌ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo