మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Aug 10, 2020 , 00:02:28

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 
  • మున్సిపల్‌ కార్మికులకు గ్లౌజులు, సబ్బులు, నూనె అందజేత

పరిగి : కరోనా కట్టడిలో పారిశుద్ధ్ద్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్మైల్‌ ఏ గిఫ్ట్‌ కార్యక్రమంలో భాగంగా పరిగి పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్ద్య కార్మికులకు గ్లౌజులు, సబ్బులు, నూనె, ఇతర వస్తువులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో  పారిశుద్ధ్ద్య కార్మికులు విశేష సేవలు అందజేశారన్నారు. సాధ్యమైనంత త్వరగా వారికి నూతన డ్రెస్సులు, మహిళా కార్మికులకు చీరలు అందజేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు త్వరలోనే తాను సైతం పరిగి నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్‌ అంబులెన్స్‌ అందజేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ అంబులెన్స్‌ కరోనా సమయంలో అందుకు సంబంధించిన వైద్యసేవలు, టెస్టింగ్‌ తదితర సేవల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. అనంతరం పరిగి దవాఖానకు సంబంధించిన సేవలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భౌతిక దూరం ఎంతో ముఖ్యమైందని, కార్మికులు సైతం పనిచేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా కట్టడి చర్యలపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం ద్వారా వ్యాప్తిని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కె.లక్ష్మీప్రసన్న, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్‌, కౌన్సిలర్లు వారాల రవీంద్ర, బద్రుద్దీన్‌, ఎదిరె క్రిష్ణ, వెంకటేశ్‌, నాయకులు బి.రవికుమార్‌ పాల్గొన్నారు.logo