మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 07, 2020 , 23:44:48

సెల్లాతో రక్షణ...

సెల్లాతో రక్షణ...

  • చేనేత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
  • చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి


వికారాబాద్‌ రూరల్‌ : సిరిసిల్ల సెల్లా ధరించి చేనేత కార్మికులకు శుభాభినందనలు తెలిపిన చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి శుక్రవారం చేనేత దినోత్సవం సందర్భంగా తన స్నేహితులకు సిరిసిల్ల సెల్లాలను బహుమతిగా ఇవ్వడంతోపాటు తాను స్వయం గా సెల్లా ధరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్లా పెద్దరికానికి, హుందాతనానికి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా ఉంటుందన్నారు. చేనేతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్లాలో వీటిని సెల్లా అని పిలుస్తారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సీఎం కేసీఆర్‌ తన వస్త్రధారణలో భాగంగా చేసుకోవడంతో తెలంగాణలో ప్రతి పౌరుడు సెల్లా ధరించాలనే ఆలోచన కలుగజేసిందని గుర్తు చేశారు. తుమ్మ, దగ్గు, జలుబు వచ్చినప్పుడు అడ్డుపెట్టుకుంటే సెల్లానే మాస్కులా పనిచేస్తుందన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేనేత కార్మికుల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. 


logo