ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 06, 2020 , 01:34:41

క్షేత్రస్థాయి విచారణ

క్షేత్రస్థాయి విచారణ

నవాబుపేట: మండల పరిధిలోని ఎక్‌మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నం.553లో 139 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎక్‌మామిడి రైతులను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ భూమి కొంత అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని.. సంబంధిత అధికారులు రైతుల సాగును అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ విచారణను జరిపారు. రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం ఆయన తిరిగి పరిశీలించారు. 28 మంది ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందామని.. ఈ సమస్యతో కొత్త పాసుపుస్తకాలు అందించలేదని రైతులు తెలిపారు. దాదాపు 1970లో ఇందిరాగాంధీ రైతు సంఘం పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. అప్పటి నుంచి కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నామని.. కొత్త పాసు పుస్తకాలు అందించాలని రైతులు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకోవడంతో ఈ విచారణ నిర్వహించారు. అటవీ శాఖకు కేటాయించిన భూమి మ్యాపును కూడా పరిశీలించారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని ఆయన రైతులకు సూచనప్రాయంగా తెలిపారు. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.


logo