బుధవారం 30 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 04, 2020 , 23:29:43

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

 తాండూరు టౌన్‌: శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. నేడు అయోధ్యలో జరిగే రామ మం దిర నిర్మాణ భూమి పూజను పురస్కరించుకుని మంగళవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ కార్యాలయంలో హిందువులు, మైనార్టీ వర్గాలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వ ల్ల కలిగిన విపత్తులో హిందువులు, మైనార్టీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. రంజాన్‌, బక్రీద్‌ పండుగలకు సహకరించిన మైనార్టీ వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా హిందువులు కూడా పండుగలు, సంప్రదాయాలలో కరోనా నిబంధనలు పాటించి సహకరించడం అభినంద నీయమన్నారు. తాండూరులో ఉన్న మత సామరస్యతను కాపాడుకోవాలన్నారు. నేడు జరిగే అయోధ్య రామ మందిర పూజ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రషీద్‌, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రవికుమార్‌, రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐలు, హిందూ, మైనార్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. 


logo