సోమవారం 21 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 04, 2020 , 23:26:09

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పరిగి : సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని 13 మందికి కల్యాణలక్ష్మి కింద రూ. 12.01లక్షలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకం గా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేదింటి యువతుల వివాహానికి సహాయం చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రి య, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ రాజేందర్‌, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo