ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Aug 03, 2020 , 08:00:44

ఆర్టీసీలో కొనసాగుతున్న సేవలు

ఆర్టీసీలో కొనసాగుతున్న సేవలు

వికారాబాద్‌ రూరల్‌ : సోదర సోదరీ ఆత్మీయ బంధానికి ప్రతీక రాఖీ. తోబుట్టువులు రాఖీ కట్టి తమ పేగు బంధం కలకాలం నిలువాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పండుగే రాఖీ. ఏటా ఈ పండుగను సంతోషంగా జరుపుకునేవారు. ఈ సంవత్సరం మాత్రం కరోనా విపత్కర పరిస్థితి నెలకొన్నందున అప్రమత్తతతోనే పండుగ జరుపుకోవాలని పలువురు సూచిస్తున్నారు. పుట్టింటికి వెళ్లలేని అక్కాచెల్లెళ్లకు ఆర్టీసీవారు అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రాఖీలు, మిఠాయిలను చేరవేస్తున్నారు. వికారాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో ఇప్పటికే చాలామంది ఆ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఆర్టీసీకి కృతజ్ఞతలు : మాధవి, సాకేత్‌నగర్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లి రాఖీలు కట్టాలని వారం రోజులుగా ఆలోచిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్గో సేవలు అందిస్తున్నారని తెలుసుకొని శుక్రవారం మా ముగ్గురు అన్నయ్యలకు రాఖీలు పంపించా. తమకు చేరాయని వారు ఫోన్‌ ద్వారా చెప్పడంతో నాకు చాలా సంతోషంగా ఉంది.


logo