బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Aug 03, 2020 , 08:00:42

అభివృద్ధే లక్ష్యం

 అభివృద్ధే లక్ష్యం

  • ఎమ్మెల్యే సూచనలు, సలహాలతోనే ప్రణాళికలు
  • టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి

వికారాబాద్‌ రూరల్‌ : నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ముందుకు సాగుతున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని గుప్తా గార్డెన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా పట్టణ అభివృద్ధిపై చర్చించి అన్ని వార్డులకు సరైన విధంగా నిధులు కేటాయించారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతంలో మున్సిపాలిటీలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద బడ్జెట్‌ కేటాయించి రూ.7కోట్ల నిధులతో పట్టణ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కొన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. అది గమనించాలన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చిట్టచివరి గ్రామం వరకు వెళ్లి గ్రామాల్లో పల్లె నిద్ర చేసి సమస్యలు తెలుసుకున్న ఏకైక ఎమ్మెల్యే ఆనంద్‌ అని పేర్కొన్నారు. 34 వార్డుల్లో సమాన నిధులతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి,  కౌన్సిలర్లు అనంతరెడ్డి, చందర్‌ నాయక్‌, కృష్ణారెడ్డి, నాయకులు రమేశ్‌కుమార్‌, లక్ష్మీకాంతరెడ్డి, విజయ్‌కుమార్‌, రాంరెడ్డి, లక్ష్మణ్‌, సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo