ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Aug 03, 2020 , 00:09:04

సండే సరదాగా..

సండే సరదాగా..

అనంతగిరిలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో సందడి నెలకొంది. పలువురు స్నేహితులతో కలిసిరాగా, మరికొంత మంది కుటుంబ సభ్యులతో వచ్చారు. అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని, అటవీప్రాంతంలో సరదాగా గడిపారు.

 

వికారాబాద్‌ రూరల్‌: వికారాబాద్‌ అనంతగిరి అటవీ ప్రాంతంలో గడపడానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి ఆదివారం ఆనందంగా గడిపారు. స్నేహితుల దినోత్సవం కలిసి రావడంతో అటవీ ప్రాంతమంతా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని అనంతరం కోనేరు సమీపంలో చెట్లకొమ్మలు, బల్లలపైన కూర్చొని తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. logo