గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Aug 02, 2020 , 00:44:14

బిజినెస్‌ ఐడియేషన్‌ ఫెస్టివల్‌లో ‘వికారాబాద్‌'కు తృతీయ బహుమతి

బిజినెస్‌ ఐడియేషన్‌ ఫెస్టివల్‌లో  ‘వికారాబాద్‌'కు తృతీయ బహుమతి

మొయినాబాద్‌: బిజినెస్‌  ఐడియేషన్‌ ఫెస్టివల్‌ పోటీల్లో  వికారాబాద్‌ మహిళా డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి వచ్చింది. శనివారం జూమ్‌ యాప్‌ ద్వారా బిజినెస్‌ ఐడియేషన్‌ టీఎస్‌ డబ్ల్యూడీడీఈఐఎస్‌, వీ-రీప్‌ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని 30 గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు పాల్గొన్నాయి. విద్యార్థులు వారి ఆలోచనల ద్వారా తయారు చేసిన ప్రాజెక్టులను జూమ్‌ యాప్‌ ద్వారా ప్రదర్శించారు. ఇందులో మొయినాబాద్‌ మండలం తోలుకట్టా గ్రామంలో ఉన్న వికారాబాద్‌ జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల  విద్యార్థినులు పాల్గొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు వాణి, సి. సౌజన్య, వై కృప ప్రదర్శించిన ప్రాజెక్ట్‌కు రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి లభించింది. మొత్తం 30 కళాశాలల నుంచి వచ్చిన 105 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిలో 15 కళాశాలలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇందులో వాటిలో వికారాబాద్‌  మహిళా డిగ్రీ కళాశాల ఉండగా, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు తృతీయ స్థానం లభించింది. విద్యార్థినులకు రూ.5000లు నగదు బహుమతిని కూడా అందజేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి కళాశాలకు తృతీయ స్థానం సాధించిపెట్టడంతో అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వనజాత మాట్లాడుతూ విద్యార్థినుల్లో బిజినెస్‌ నైపుణ్యాన్ని పెంపొందించడానికి బిజినెస్‌ ఐడియేషన్‌ ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతో గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఏర్పాటు చేయించారని చెప్పారు. ఇందుకు కామర్స్‌ లెక్చరర్‌ పి.అర్పిత తర్ఫీదు ఇచ్చారన్నారు.


logo