ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Aug 01, 2020 , 00:01:31

బక్రీద్‌ను ఇండ్ల వద్దే జరుపుకోవాలి

బక్రీద్‌ను ఇండ్ల వద్దే జరుపుకోవాలి

- వికారాబాద్‌ ఎస్పీ నారాయణ

వికారాబాద్‌: ముస్లింలు బక్రీద్‌ ప్రార్థనలు ఈద్గాల వద్ద కాకుండా తమ ఇండ్లలోనే జరుపుకోవాలని వికారాబాద్‌ ఎస్పీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పండుగరోజు ఇతరులకు చేతులు కలుపడంగానీ, అలయ్‌ బలయ్‌ తీసుకోవడం గాని చేయకుండా, భౌతికదూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించుకుని బక్రీద్‌ను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. 

ధారూరులో..

ధారూరు: ముస్లింలు బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ మురళీకుమార్‌ అన్నారు. మండలంలోని నాగసముందర్‌, నాగారం, కుక్కింద, దోర్నాల్‌, మోమిన్‌కలాన్‌ గ్రామాల్లోని  ముస్లిం మత పెద్దలను కలిసి మాట్లాడారు. ఆయనతో ధారూరు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు, సిబ్బంది ఉన్నారు.


logo