శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jul 31, 2020 , 00:03:53

కొడంగల్‌ ‘కో ఆప్షన్‌లో’ అన్ని స్థానాలూ టీఆర్‌ఎస్‌వే

 కొడంగల్‌  ‘కో ఆప్షన్‌లో’  అన్ని స్థానాలూ టీఆర్‌ఎస్‌వే

  • ముగ్గురు ఏకగ్రీవం.. ఒక కో-అప్షన్‌కు ముగ్గురి మధ్య పోటీ

కొడంగల్‌ :  కొడంగల్‌ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికలు ఉత్కంఠత మధ్య కొనసాగాయి. గురువారం స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటలక్ష్మి కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించి కో-ఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మున్సిపల్‌ పరిధిలో నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులకుగాను శారదమ్మ, సయ్యద్‌ మునీర్‌, హజీరాబేగం, రమేశ్‌బాబు, కోస్గి వెంకటయ్య, బంటు ఫకీరప్ప నామినేషన్లు దాఖలు చేశారు.

మున్సిపల్‌ పరిధిలోని 12మంది కౌన్సిలర్ల సమక్షంలో ఎన్నికలు ప్రారంభం కాగా శారదమ్మకు 11 మంది, సయ్యద్‌ మునీర్‌కు 12 మంది, హజీరాబేగంకు 12 మంది మద్దతు తెలుపడంతో విజయం సాధించారు. ఆ తరువాత మిగిలిన ఒక కో-ఆప్షన్‌ స్థానానికి ముగ్గురి మధ్య పోటీ ఏర్పడగా.. రమేశ్‌బాబుకు ఇద్దరు, వెంకటయ్యకు ఒకరు మద్దతు తెలుపగా ఫకీరప్ప 9 మంది మద్దతుతో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌లో ఉన్న బడ్జెట్‌ ప్రకారం ఒక్కో మున్సిపల్‌ కౌన్సిలర్‌కు రూ.5లక్షల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని, వార్డులో అత్యవసర పనులకు సంబంధించి నిధులు వెచ్చించాలని సూచించారు. లైసెన్స్‌ పొందిన కాంట్రాక్టర్‌లతో మాత్రమే పనులు చేయించాలనే నిబంధన ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్‌ అభివృద్ధిలో మంజూరైన రూ.15కోట్లకు సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, సీసీ, డ్రైనేజీ వంటి పనులు కాకుండా ఇతరత్రా పనులు నిర్వహించుకుంటే నిధులు సద్వినియోగమవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్‌, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, డా.శ్రీలతాయాదవ్‌, సరోజ, రమేశ్‌బాబు, శంకర్‌నాయక్‌, సాయిప్రసన్న, సమీనాఖాతున్‌ పాల్గొన్నారు.   


logo