గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 30, 2020 , 00:23:35

పూడూరులో ఒక్కరికి పాజిటివ్‌

పూడూరులో ఒక్కరికి పాజిటివ్‌

పూడూరు : పూడూరు మండల కేంద్రంలోనిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మండల వైద్యాధికారి సుధాకర్‌, ఎస్‌ఐ భీమ్‌ కుమారు ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, వారి కుటుంబ సభ్యులను, ఇంటి పక్కల ఉన్న కుటుంబాలను  హోం క్వారంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తిని ప్రస్తుతం ఇంటి వద్దనే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో ఎవరికి వారు భౌతిక దూరం పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మక్తవెంకటాపూర్‌లో ఆర్టీసీ ఉద్యోగికి ..

   కులకచర్ల: మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్‌ మరళీకృష్ణ తెలిపారు. బుధవారం మక్తవెంకటాపూర్‌ గ్రామంలో పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. హైదారబాద్‌లో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అస్వస్థతకు గురవగా హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలగా అతన్ని గాంధీ దవాఖానకు తరలించి, గ్రామంలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌గా గుర్తించిన 15మందిని హోం క్వారంటైన్‌లో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

మండలంలో ఇద్ద్దరికి .. 

  పరిగి : పరిగి పట్టణంలో బోయవాడకు చెందిన చెందిన ఒక యువకుడికి, మండలంలోని రంగంపల్లికి చెందిన 65 సంవత్సరాల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చిట్యాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గౌస్‌ తెలిపారు. వారిద్దరూ హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు డాక్టర్‌ పేర్కొన్నారు.


logo