బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jul 30, 2020 , 00:21:10

మందిపాల్‌లో ఆగస్ట్‌ 15వరకు లాక్‌డౌన్‌

మందిపాల్‌లో ఆగస్ట్‌ 15వరకు లాక్‌డౌన్‌

కులకచర్ల: కరోనా వైరస్‌  కారణంగా కులకచర్ల మండల పరిధిలోని మందిపాల్‌ గ్రామంలో ఆగస్ట్‌ 15వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు గ్రామ సర్పంచ్‌, సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు మఠం ప్రమీల పేర్కొన్నారు. బుధవారం గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో లాక్‌డౌన్‌ నిర్వహించేందుకు వ్యాపారులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారని దీంతోనే గ్రామంలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరువాలని నిర్ణయించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి మాణిక్యం, ఉపసర్పంచ్‌ సునీత బాల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజశేఖర్‌, వ్యాపారులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

 10 రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలి 

 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని కులకచర్ల సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గోరిగడ్డతండాకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురికి , పుణె నుంచి వచ్చిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ హైదరాబాద్‌, పుణెలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని అక్కడి నుంచి గ్రామాలకు వచ్చిన వారు కనీసం 10రోజులైనా హోంక్వారంటైన్‌లో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు. logo