శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jul 28, 2020 , 00:07:44

వాణిజ్య బ్యాంకులకు దీటుగా సొసైటీ సేవలు

 వాణిజ్య బ్యాంకులకు దీటుగా సొసైటీ సేవలు

  • ప్రతి పీఏసీఎస్‌కు గోదాం నిర్మాణం 
  • మన్నెగూడలో సహకార బ్యాంకు ఏర్పాటు 
  • వ్యాపారులకు రూ.25లక్షల వరకు క్యాష్‌ క్రెడిట్‌ సదుపాయం 
  • సేవల సరళీకరణకు ప్రత్యేక చర్యలు
  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 

పరిగి : వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకు సేవలు అందిస్తున్నామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. సహకార బ్యాంకుల ద్వారా అందుతున్న సేవలు మరింత సరళతరం చేసేందుకు ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నామన్నారు. పరిగిలో రూ.40 లక్షలతో చేపట్టిన ప్రాథమిక సహకార సంఘం భవన నిర్మాణాన్ని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏటీఎం నిర్మాణానికి, రాఘవాపూర్‌లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా వినియోగదారులకు సేవలు త్వరితగతిన, నాణ్యమైన విధంగా అందించేందుకు డీసీసీబీ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. పరిగిలో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎం కేంద్రం ఏర్పాటు ద్వారా నగదు డ్రా చేసుకునేందుకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. పూడూరు మండలం మన్నెగూడలో త్వర లో సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని ఎమ్మె ల్యే వెల్లడించారు. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకి రుణాలు సహకార బ్యాం కు ఇస్తుందని, వ్యాపారస్తులకు రూ.25 లక్షల వరకు క్యాష్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని సహకార బ్యాంకు అందజేస్తుందన్నారు.

ప్రతి పీఏసీఎస్‌ పరిధిలో ఒక గోదాం నిర్మా ణం చేపడుతున్నామని, సాధ్యమైనంత త్వరగా గోదాముల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 వేల మంది కొత్త రైతులకు రూ.70 కోట్లు పంట రుణాలు అం దించామని అన్నారు. ఈసారి రూ.100 కోట్లు దీర్ఘకాలిక రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పౌల్ట్రీ ఏర్పాటుకు రూ.25 లక్షల వరకు రుణాలు అందిస్తామని, పాడి పశువుల కోసం రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహకార బ్యాంకులలో నూ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని, అన్ని బ్యాంకుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజులలో సహకార బ్యాంకు ద్వారా మరిన్ని సేవలు విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీపీ కె.అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి, డీసీసీబీ బ్యాంకు సీఈవో ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆర్‌.ఆంజనే యులు, జడ్పీ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు మీర్‌ మహమూద్‌అలీ, నార్మాక్స్‌ మాజీ డై రెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌వో సత్యనాయక్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ పి.వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ జగన్‌, బ్యాంకు మేనేజర్‌ బాలకృష్ణ, పీఏసీఎస్‌ సీఈవో అమరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. logo