బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jul 27, 2020 , 01:03:51

అత్యవసరమైతేనే బయటకు రండి

అత్యవసరమైతేనే బయటకు రండి

వికారాబాద్‌: పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నే పథ్యంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, అ  త్యవసరమైతేనే బయ టకు రావాలని సీఐ శ్రీని వాస్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. కరోనా వచ్చిన వారు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, మనో ధైర్యంతో ఉండాలని తెలిపారు. బయటకొస్తే తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిం చారు. ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత వరకు ఒక్కరే ప్రయాణించాలని కోరారు.

అప్రమత్తంగా ఉండాలి

బంట్వారం: రోజురోజుకు కరోనా కేసులు పెరు గు తున్న నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండా లని సీఐ రాజశేఖర్‌ తెలి పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లా డు తూ కరోనా మహ మ్మారి విజృంభిస్తూ పల్లెలను తాకిందన్నారు. రెండు మూడు రోజు లుగా మండలంలో ఐదు కేసులు నమోద య్యాయని, ఒకరు మృతి చెం దారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. 


logo