మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jul 27, 2020 , 00:53:36

108లో ప్రసవం

108లో ప్రసవం

కులకచర్ల: అల్లాపూర్‌ తండాకు చెందిన కర్రె ఉషకు ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. వెం టనే సిబ్బంది అక్కడికి చేరుకొని దవాఖానకు తీసుకెళుతుండగా ఉషకు పురి టి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. పాప మెడకు బొడ్డుతాడు చుట్టుకోవడంతో ఈఎంటీ శివశంకర్‌ అప్రమత్తంగా వ్యవహరించారు. కాన్పులో మగ బిడ్డ పుట్టడంతో కుటుంబసభ్యులు ఆనం దం వ్యక్తం చేశారు.  వైద్యం అందించిన 108 సిబ్బందిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పైలెట్‌ ఖుర్షీద్‌ పాల్గొన్నారు. 


logo