గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 27, 2020 , 00:14:02

l పట్టణ ప్రగతితో సమస్యలు దూరం

l పట్టణ ప్రగతితో సమస్యలు దూరం

  • l వినూత్న పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వం
  • l అన్నదాతల అభ్యున్నతికి రూ.520 కోట్లతో రైతు వేదికలు
  • l జిల్లాలో రూ.72 కోట్లతో చెక్‌డ్యామ్‌లు 
  •       l విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 
  • l నవాబుపేట మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలుచేస్తున్నదని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పలుచోట్ల రైతువేదికల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రైతు వేదికలు అన్నదాతల అభ్యున్నతికి అన్నిరకాలుగా సహకరిస్తాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులతో అనుసంధానమై అవసరమైన సూచనలు ఇస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.520 కోట్లతో ఈ వేదికలు

నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే చివరి రైతు వరకూ రైతుబంధు సాయం అందిస్తామన్నారు. భూగర్భజలాలు పెంపొందించడానికి జిల్లాలో రూ.72 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా 5 లక్షల 90వేల పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం  రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. గేటువనంపల్లిలో హరితహారం కార్యక్రమం బాగా నిర్వహించారని మంత్రి ప్రశంసించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వీటికి ప్రతినెలా ఇస్తున్న నిధులతో సమస్యలు లేని పల్లెల్లు, పట్టణాలుగా మారుతున్నాయన్నారు. 

-నవాబుపేట 

నవాబుపేట: రాష్ట్ర వ్యాప్తంగా రూ.520 కోట్లతో రైతుల కోసం రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చించల్‌పేట, నవాబుపేట, పులుమామిడి, మీనపల్లికలాన్‌, ఎల్లకొండ గ్రామాల్లో ఆమె రైతు వేదిక భవనాల నిర్మాణాలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. చించల్‌పేటలో 17 సీసీ కెమెరాలనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఈ వేదికలు వ్యవసాయ దీపికలుగా పని చేస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అన్నదాతలకు అందజేయాలని భావించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, కల్లాల నిర్మాణం, నియంత్రిత సాగు విధానాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు కూడా చెల్లిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2848 కోట్లతో 639 చెక్‌ డ్యాంలను నిర్మిస్తున్నదన్నారు. జిల్లాలో రూ.72 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న 26.37 లక్షలపై చిలుకు విద్యార్థులకు  కోటి 51 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. జిల్లాలో 5 లక్షల 90 వేల పుస్తకాలు అందించామన్నారు. గురుకులాల ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేసి పేదల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టి గ్రామ పంచాయతీలకు నేరుగా రూ.339 కోట్లను, పట్టణ ప్రగతి ద్వారా రూ.148 కోట్లను ప్రతి నెలా  అందజేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించాలన్న సంకల్పంతో డంపింగ్‌ యార్డులను నిర్మించి, ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నదన్నారు. శ్మశానవాటికలను కూడా అద్భుతంగా నిర్మిస్తున్నదన్నారు. మిషన్‌ భగీరథ, రైతు బంధు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.
మంత్రి కాన్వాయి వెళ్తున్న గేటువనంపల్లి రోడ్డు పక్కన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు చూడముచ్చటగా కనిపించడంతో గమనించిన మంత్రి ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పులుమామిడిలో 25 ఏండ్ల క్రితం గృహ నిర్మాణాలకోసం 4 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల ద్వారా సేకరించిందని సర్పంచ్‌ విమల రంగారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమి సర్వే నంబరు తప్పుగా నమోదు చేయడంతో నిరుపయోగంగా మారిందని, సరి చేయించి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రిని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తాసిల్దార్‌ వెంకటేశ్‌, డీఈ రాజరత్నం, ఏఈ లక్ష్మయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌గౌస్‌, నాయకులు మల్‌రెడ్డి, రంగారెడ్డి, ఎల్‌.రంగారెడ్డి, మానిక్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాములు, రాంచంద్రయ్య, ఏసుదాసు, ఖదీర్‌, మాణయ్య, దేవయ్య, ప్రకాశం పాల్గొన్నారు.


logo