గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 25, 2020 , 00:01:13

ఆదుకుంటాం

ఆదుకుంటాం

భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని  కలెక్టర్‌ పౌసుమిబసు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లో శుక్రవారం వారు పర్యటించి  నీట మునిగిన పంటపొలాలు, దెబ్బతిన్న ఇండ్లు, ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. పంట నష్టం వివరాలు త్వరగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. 

-తాండూరు రూరల్‌ 

 తాండూరు రూరల్‌, పెద్దేముల్‌ : ఇటీవల కురిసిన భారీ వ ర్షానికి నష్టపోయిన రైతులకు, నీట మునిగిన వివిధ కాలనీ ల ఇండ్ల బాధితులకు త్వరలోనే నష్టపరిహారం దక్కేలా చూ స్తామని, భవిష్యత్తులో వరద నీరు ఇండ్లలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, వర్షాలకు పంట నష్ట పోయిన రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్‌లోని భవానీ కాలనీ, కోటబాసుపల్లిలోని వడ్డెరగల్లీ, ఐనెల్లి, అల్లాపూర్‌ గ్రామాల్లో , పెద్దేముల్‌ మండల పరిధిలోని ఇందూరు, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో అకాల వర్షాలకు నీట మునిగిన ఇండ్లను, పంట పొలాలను, కాలనీలను, ఇందూరు బ్రిడ్జిని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. వెంటనే నష్టపోయిన బాధితుల వివరాలను సేకరించి నివేదికను అందించాలని, సహాయక చర్యలను ప్రారంభించాలని పలు శాఖల అధికా రులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకు లు పాడైనవారికి అతి త్వరలో అధికారుల సాయంతో సరు కులను అందిస్తామని, కొన్ని చోట్ల ఇండ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని వారికి కూడా ప్రభుత్వం ద్వారా పరిహా రం అందేలా చూస్తామని తెలిపారు. రైతులు ఎంత మొత్తం లో పంటలను నష్టపోయారో నివేదిక తయారు చేయిస్తు న్నామని అన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇబ్బందులు పడు తున్న బాధితులు కొంత సంయమనం పాటించి అధికారు లకు, ప్రజాప్రతినిధులకు సహకరించాలని కోరారు. అనం తరం వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ వరద నీరు ఇండ్లలోకి చేరకుండా ఇందూరు బ్రిడ్జి వద్ద ప్రత్యా మ్నాయ ఏర్పాట్లను చేసి పనులు వెంటనే ప్రారంభించా లని, ఇండ్లలోకి నీరు చేరిన బాధితులు, పంట పొలాలు నష్టపోయిన రైతుల వివరాల నివేదికను తయారు చేయాల ని ఆదేశించారు.  మల్కాపూర్‌ వాగులోని సీల్ట్‌ను తీసేందు కు చర్యలు తీసుకో వాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచిం చారు. వరదనీరు సాఫీగా పారేలా చూడాలన్నారు. కార్యక్ర మంలో తాసిల్దార్‌ చెన్నప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శ న్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాందాస్‌, ఉమా శం కర్‌, సర్పంచ్‌ పద్మ, ఉపసర్పంచ్‌ లాలప్ప, ఎంపీటీసీ ప్రవీ ణ్‌ పటేల్‌, నాయకులు ఇందూర్‌ మొగులప్ప, నరేందర్‌, ప్రకాశ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు నా రాయణరెడ్డి, రమేశ్‌, మురళీగౌడ్‌ అధికారులు పాల్గొన్నారు

 వరద ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌

 

భారీ వర్షాలకు నీట మునిగిన గ్రామాలను శుక్రవారం జి ల్లా కలెక్టర్‌ పౌసుమి బసు పరిశీలించారు. తాండూరు మం డలం సంగెంకలాన్‌, మల్కాపూర్‌తోపాటు ఐనెల్లి, అల్లాపూ ర్‌ బ్రిడ్జీలను, సంగెంకలాన్‌ గ్రామంలో పంట పొలాలను, కర్నాటక సరిహద్దులోని వాగును పరిశీలించారు. చిట్టెనాడు సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళ్లే రైల్వే బ్రిడ్జి చిన్నగా ఉండడం వల్ల వరద ఉధృతంగా ఉన్న సమయంలో వాగులోని నీరు గ్రా మంలోకి చేరుతున్నదని.. పంట పొలాలను ముంచెత్తుతు న్నదని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై రైల్వే అధికారులతో మాట్లాడుతానని కలెక్టర్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చేం దుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మల్కాపూర్‌ బ్రిడ్జిని పరిశీలించా రు. వాగు పక్కన పిచ్చి మొక్కలు తొలగించి, నీరు సక్రమం గా వెళ్లేలా చూడాలని ఇరిగేషన్‌ ఈఈ సుందర్‌ను ఆదేశిం చారు. ఐనెల్లి, అల్లాపూర్‌ ఆర్‌అండ్‌బీ బ్రిడ్జీలను కలెక్టర్‌ పరి శీలించి వరదనీరు సక్రమంగా వెళ్లేందుకు చర్యలు తీసుకో వాలని సంబంధిత అధికారులను కోరారు. ఏయే పంటల కు ఎంతమేర నష్టం జరిగిందనే వివరాలను సమగ్రంగా సేకరించాలని ఏడీఏ శంకర్‌ రాథోడ్‌ను ఆదేశించారు. logo