బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jul 23, 2020 , 23:33:41

మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

  • జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి

షాబాద్‌ : మంత్రి కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందనవెళ్లి వద్ద మంత్రి కేటీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్‌టైల్స్‌ పార్కు ప్రారంభోత్సవానికి ఈ నెల 25న మంత్రి కేటీఆర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. ముందుగా హైతాబాద్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతారన్నారు. శుక్రవారం మంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు జడ్పీటీసీ తెలిపారు. కార్యక్రమంలో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, నాయకులు పాల్గొన్నారు. logo