గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 23, 2020 , 23:29:53

అదుపు తప్పి సిమెంట్‌ లారీ బోల్తా

అదుపు తప్పి సిమెంట్‌ లారీ బోల్తా

చేవెళ్ల రూరల్‌ : రామగుండం నుంచి చిత్తాపూ ర్‌ వెళ్తున్న సిమెంట్‌ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో అదుపుతప్పి రోడ్డుకు అడ్డం గా పడిపోయిన ఘటన మండలంలోని మీర్జాగూడ స్టేజీ సమీపంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డుపై జరిగింది. చేవెళ్ల సీఐ సీహెచ్‌.బాలకృష్ణ కథనం ప్రకారం.. గురువారం ఉదయం రామగుండం నుంచి చిత్తాపూర్‌ వెళ్తున్న సిమెంట్‌ లారీ ( టీఎస్‌ 07 యూ జీ 4222) అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడడంతో అటుగా ప్రయాణిం చే వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. సమాచారం తెలుసుకు న్న సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్‌ సయిద్‌ అహ్మద్‌ పాషాపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కార్యక్రమం లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. logo