సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 22, 2020 , 23:33:25

నేటి నుంచి ముజాహిద్‌పూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

నేటి నుంచి ముజాహిద్‌పూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కులకచర్ల: మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌ గ్రామంలో గురువారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్‌ లక్ష్మీఆనంద్‌ తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో ఉన్న దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున గ్రామంలో కూడా లాక్‌డౌన్‌ విధించేందుకు గ్రామ సభలో తీర్మానించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా నుంచి బయట పడవచ్చునన్నారు. గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 10గంటల వకు దుకాణాలు తెరిచేందుకు సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 31వరకు గ్రామంలో ఈ పద్ధ్దతిని పాటించాలని సూచించారు.  


logo