సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 22, 2020 , 23:32:14

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

 రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

  • ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా 

తాండూరు: రైతు సంక్షేమాన్ని తెలంగాణ సర్కార్‌ పెద్దపీట వేస్తున్నదని యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా పేర్కొన్నారు. బుధవారం యాలాల మండలం రాఘవాపూర్‌, రాస్నం, ముద్దాయిపేట్‌, అడల్‌పూర్‌, సంగాయిగుట్టతండా, బషీర్మియతండాలో కంపోస్ట్‌ షెడ్ల ప్రారంభోత్సవంతో పాటు  కల్లాల నిర్మాణానికి ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే సర్కార్‌ ధ్యేయమని, రైతును రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి లాభసాటిగా మారుస్తున్నారని అన్నారు. పల్లెల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు, కల్లాలు అన్నదాతలకు వరంగా మారనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రమేశ్‌, జిల్లా కోఆప్షన్ల అధ్యక్షుడు అక్బర్‌బాబ, సహకార సంఘం డైరెక్టర్‌ విఠల్‌నాయక్‌, అశోక్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమాభివృద్ధికే రైతు వేదికలు

పూడూరు: రైతుల సంక్షేమాభివృద్ధి కోసమే గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తునట్లు ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల పేర్కొన్నారు. మండలం కంకల్‌ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ  మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అధికారులు  మరింత అందుబాటులో ఉండేందుకే క్లస్టర్లను ఏర్పాటు చేసి, రైతు వేదిక భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంతోషవీరన్న,  రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి, ఏవో సామ్రాట్‌రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు.


logo