గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 23, 2020 , 00:09:26

రైలు ఇంజిన్‌ ఢీకొని.. ముగ్గురు సిబ్బంది మృతి

రైలు ఇంజిన్‌ ఢీకొని..  ముగ్గురు సిబ్బంది మృతి

  • మరో 9 మందికి స్వల్ప గాయాలు
  • వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదం
  • సమాచార లోపమే కారణమని పోలీసుల అభిప్రాయం

వికారాబాద్‌ : కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కొంద రు, ఎన్నో ఏండ్లుగా  ఉద్యోగం చేస్తున్న వారు మరి కొంద రు, అందరూ కలిసి విధులకు హాజరై పనులు చేస్తున్నారు. అంతలోనే మృత్యువు దూసుకొచ్చింది. బ్రిడ్జిపై పనులు చే స్తుండడంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం.. రైలు తమ వైపు వస్తుండడంతో 12 మంది గుండెల్లో అలజడి.. అప్రమత్తమయ్యే లోపే ముగ్గురు ప్రాణాలు గాలిలో కలువ గా మిగతా 9 మంది ప్రాణాలతో బయటపడ్డ సంఘటన వికారాబాద్‌ పట్టణంలో బుధవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి (55), నవీన్‌(35), బీహార్‌కు చెం దిన కమలేశ్‌, శంషీర్‌అలీ (22), రాహుల్‌, చందన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనోజ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన సంజయ్‌, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన నర్సింహులు, కట్ట శ్రీకాంత్‌, శివ, శ్యామ్‌సన్‌ హైదరాబాద్‌ దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో నలుగురు కొన్ని ఏండ్లుగా విధులు నిర్వహిస్తుండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు, ఈ ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు తొమ్మిది నెలల క్రితమే రైల్వేలో పెయింటింగ్‌ ఇతర విభాగాల్లో విధుల్లో చేరారు. విధుల్లో భాగంగా బుధవారం ఉదయం సికింద్రాబాద్‌ కార్యాలయంలో రిపోర్టు చేసి 12 మంది బృందం వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని చిట్టిగిద్ద వెళ్లే మార్గం లో ఉన్న బ్రిడ్జిపై పెయింటింగ్‌ పనులు చేసేందుకు చేరుకున్నారు. కేవలం ఒక గంట పని చేశారు. అంతలోనే చిట్టిగిద్ద  నుంచి వికారాబాద్‌ వైపు వచ్చే రైలు ఇంజన్‌ వారి పైకి దూ సుకొచ్చింది. ప్రతాప్‌రెడ్డి, నవీన్‌, శంషీర్‌అలీ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ముందుకు పరుగు తీయగా రైలు వారిని ఢీకొట్టింది.

దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రతాప్‌రెడ్డి మృతదేహం బ్రిడ్జి కింద పడగా, శం షీర్‌అలీ, నవీన్‌ మృతదేహాలు ప్రమాదం జరిగిన స్థలం  ముందుకు వెళ్లి పట్టాలపై పడ్డాయి. మిగతా వారు అప్రమత్తమై పక్కనే ఉన్న చిన్న వంతెన, ఇతర వాటిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్‌ సివిల్‌ పోలీసులు, రైల్వే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో నుంచి బయట పడ్డ వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జిల్లా ఎస్పీ నారాయణ, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శ్రీనివాస్‌ ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం లోపం వల్ల, రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరి గి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


logo