సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 21, 2020 , 23:35:36

భారీ వర్షం...

భారీ వర్షం...

వికారాబాద్‌: జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బొంరాస్‌పేట్‌ ప్రాజెక్టు నిండి అలుగు పారగా, కోట్‌పల్లి ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. బంట్వారం, దోమ మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు  వర్షం కురిసింది. జిల్లాలోని కొన్ని మండలాలు మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుల్కచర్ల మండలంలో 76 మి.మీ, అత్యల్పంగా పరిగి మండలంలో 3.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 55.2, మోమిన్‌పేట్‌ 10, నవాబుపేట్‌ 25.4, వికారాబాద్‌ 33.2, పూడూరు 42.4, దోమ 70.8, ధారూరు 42.2, బంట్వారం 66.2, తాండూరు 48.4, యాలాల్‌ 48.2, పెద్దేముల్‌ 40.2, బషీరాబాద్‌ 26, బొంరాస్‌పేట్‌ 60.2, కొడంగల్‌ 20.4, దౌల్తాబాద్‌ 6 మి.మీ వర్షపాతం నమోదైంది. 


logo