శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jul 20, 2020 , 00:48:07

కరోనాతో వ్యక్తి మృతి

కరోనాతో వ్యక్తి మృతి

యాచారం: కరోనాతో మండల కేంద్రానికి చెందిన 55 ఏండ్ల వ్యక్తి ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న అతను ఈ నెల 12న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ర్యాపిడ్‌ టెస్టులో అతనికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో  కుటుంబ సభ్యులు అతనిని నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. అతని కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో కుమారుడికి పాజిటివ్‌ రావడంతో వారందరిని హోం క్వారంటైన్‌ చేశారు.


logo