సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 20, 2020 , 00:27:48

హాస్టళ్లలో భద్రతపై తనిఖీలు

హాస్టళ్లలో భద్రతపై తనిఖీలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐటీ ఉద్యోగినులు, విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ జోన్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలీ, మాదాపూర్‌, రాయదుర్గంలోని 144 హాస్టళ్లు, పీజీ హాస్టళ్లను తనిఖీ చేశారు. 20 బృందాలుగా ఏర్పడిన ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు, పోలీసులు హాస్టళ్లలో సోదాలు చేశారు. తనిఖీలను షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు రక్షణ సూత్రాలు జారీ చేశారు.

  1. * ప్రతి హాస్టల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. 
  2. * హాస్టల్‌ ప్రహరీ 5 అడుగుల ఎత్తు ఉండాలి. 
  3. * ప్రతి హాస్టల్‌లో వాచ్‌మెన్‌ తప్పనిసరి.
  4. * ప్రతి హాస్టల్‌ నిర్వాహకులు వచ్చి, వెళ్లేవారి వివరాలు, వారికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా విజిటర్‌ బుక్‌లో ఎంట్రీ చేయాలి. 
  5. * హాస్టల్‌లో ఉంటున్న వారితో పాటు స్టాఫ్‌కు సంబంధించిన వారి ధ్రువీకరణ పత్రాలు నిర్వాహకులు సేకరించుకోవాలి. 
  6. * హాస్టల్‌లో ఉండేవారికి లాకర్‌ సౌకర్యం కల్పించాలి. 
  7. * అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన పరికరాలు ఉండాలి. 
  8. * ప్రాథమిక వైద్య చికిత్స కిట్లు ఉండాలి. 


logo