సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 17, 2020 , 23:18:34

బిందు సేద్యానికి దరఖాస్తులు ఆహ్వానం

బిందు సేద్యానికి దరఖాస్తులు ఆహ్వానం

  • జిల్లా ఉద్యాన అధికారి మాలిని

వికారాబాద్‌ రూరల్‌: ఉద్యాన పంటల సాగుపై బిందు సేద్యానికి  దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఉద్యాన అధికారి మాలిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండ్లతోటలు, మల్బరీ, శ్రీగం ధం, సరుగుడు, వెదురు, మల్బరీ వేప చెట్లు పెట్టే రైతులకు సబ్సిడీతో బిందుసేద్యం పరికరాలు అందజేయనున్నట్టు తెలిపారు. బిందు సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు.

ఐదు హెక్టార్లు ఉన్న రైతులకు 80 శాతం రాయితీపై, రెండు హెక్టార్లు ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యానికి రాయితీ కల్పించగా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ పథకంపై 13 శాతం జీఎస్టీ పన్ను మాత్రం రైతులే భరించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని పండ్లతోటలు, మల్బరీ తోటలు పెట్టుకునే రైతులు సద్వినియోగం చేసుకోవలన్నారు. అర్హులైన రైతులు ఆధార్‌కార్డు, పట్టదారు పాసుపుస్తకం, ఫాం 18, బ్యాంకు ఖాతాబుక్కు, పాసుపోర్టుసైజు ఫొటోతో మీ సేవ కేం ద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం మీ సేవ రసీదును మండలంలోని ఉద్యాన వన అధికారులకు అందించాలని తెలిపారు. logo