శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jul 17, 2020 , 23:17:30

దోమ తాసిల్దార్‌ కార్యాలయం మూసివేత

 దోమ తాసిల్దార్‌ కార్యాలయం మూసివేత

దోమ: దోమ  తాసిల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం మూసివేశారు. మంగళవారం దోమ మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలిం చిన ఆర్డీవో ఉపేందర్‌కు కరోనా పరీక్షలో పాజిటివ్‌ అని తేలడంతో శుక్రవా రం నాడు తాసిల్దార్‌ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయానికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలు ఈ నెల చివరి వరకు వేచి ఉండాలని అన్నారు.

   కరోనాతో వృద్ధురాలు మృతి

ధారూరు: కరోనా  సోకిన ధారూరు మండలం నాగ సముందర్‌ గ్రామానికి చెందిన వృద్ధురాలు శుక్రవారం మృతి చెందినట్లు ధారూరు పీహెచ్‌సీ డాక్టర్‌ రాజు తెలిపారు.  గురువారం కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు.


logo