సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 15, 2020 , 23:27:56

పేదలకు ఆపన్నహస్తం

పేదలకు ఆపన్నహస్తం

  • 40మందికి రూ. 19.60లక్షలు  ఆర్థిక సహాయం అందజేత

పరిగి : పేద కుటుంబాల వారికి కార్పొరేట్‌ వైద్యం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సర్కారు ఆపన్నహస్తం అందిస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తన నివాసంలో పరిగి, దోమ, కులకచర్ల, గండీడ్‌, పూడూరు మండలాలకు చెందిన 40మందికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ. 19.60లక్షలకు విలువైన చెక్కులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ సరైన వైద్యం అందించాలన్నదే సర్కారు లక్ష్యమన్నారు. ఓవైపు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సహాయం అందజేస్తూనే మరోవైపు సర్కారు దవాఖానలను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన చికిత్స కోసం అవసరమైన యంత్ర పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పరిగి, పూడూరు జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, మలిపెద్ది మేఘమాల, పరిగి ఎంపీపీ అరవిందరావు, దోమ సర్పంచ్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీ యాదయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మలిపెద్ది ప్రభాకర్‌గుప్తా, శ్రీనివాస్‌గుప్తా, మౌలానా, నర్వోత్తం రెడ్డి పాల్గొన్నారు.


logo