సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jul 15, 2020 , 23:26:21

మినీ ట్యాంక్‌బండ్‌ను సుందరీకరిస్తాం : ఎమ్మెల్యే

మినీ ట్యాంక్‌బండ్‌ను సుందరీకరిస్తాం : ఎమ్మెల్యే

ఆమనగల్లు : ఆమనగల్లు సురసముద్రం మినీ ట్యాంక్‌ బండ్‌ను ఆహ్లాదకరంగా సుందరీకరిస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రానికి ఒకటి చొప్పున చెరువులను ఎంపిక చేసి మినీ ట్యాంక్‌బండ్‌ పనులను ప్రారంభించిందని గుర్తు చేశారు. 5మండలాల కూడలి ఆమనగల్లు పట్టణం కావడంతో మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం కోసం అనువైనది గుర్తించినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆమనగల్లు పట్టణ సమీపంలోని సురసముద్రం చెరువును డీఈ పరమేశ్వర్‌, ఏఈ రజిత, క్వాలిటీ కంట్రోలర్‌ అధికారిణి జ్యోతి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా ఆమనగల్లు సురసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా ఎంపిక చేసి రూ. 5.90కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. చెరువు కింద అధికారికంగా 507 ఎకరాలు, అనధికారికంగా 100ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంటుందన్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ తరహాలో సురసముద్రం చెరువును అన్ని విధాలుగా ఆహ్లాదకరంగా నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు అధికారులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కట్టమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గిరి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంగలి రఘు, బాలస్వామి, ఖలీల్‌, శ్రీను పాల్గొన్నారు.logo