జిల్లాలో కరోనా విజృంభణ

మోత్కూరు : మండలంలోని పొడిచేడులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి డాక్టర్ కిశోర్‌కుమార్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఇటీవల తన అత్తగారి ఊరైనా సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి వెళ్లాడన్నారు. అయితే అనుమానంతో అక్కడి వైద్య సిబ్బంది అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా శుక్రవారం కరోనా పాజిటివ్‌గా వచ్చిందన్నారు. వెంటనే అతడిని, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. అతడితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న మరొకరిని కూడా హోం క్వారంటైన్ చేశారన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజన్నగూడెంలో బీహార్‌కు చెందిన 14 మందిని హోం క్వారంటైన్ చేశామన్నారు.
ఆలేరులో ఒకరికి..
ఆలేరు టౌన్ : పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్య నోడల్ అధికారి జ్యోతిబాయి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వ్యక్తి అనుమానం వచ్చి అతడే హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో వెంటనే మండల వైద్యసిబ్బందితో అక్కడికి చేరుకొని అతనితోపాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు పట్టణంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు.
హోం క్వారంటైన్లో 209 మంది
భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 209 మందిని హోం క్వారంటైన్లో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, 629 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్లో ఏడుగురు ఉన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!