ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 00:42:44

ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

చేవెళ్ల : కరోనా వైరస్‌ను నివారించడంతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్‌ శైలజారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టడంతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కాలనీవాసులకు సూ చించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు మన దరికి చేరవన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ఆమనగల్లు : కరోనా నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని గురువారం ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకులు అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలలుగా ప్రై వేట్‌ ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. తాము పనిచేసిన సంస్థ నుంచి జీతాలు రాక కుటుంబ పోషణ కోసం చేసే ది లేక భవిష్యత్‌ అంధకారం అయిందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రైవే ట్‌ ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు దినేశ్‌, నాయకులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్‌

కడ్తాల్‌ : మండల కేంద్రంలోని వ్యాపారులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని దుకాణాదారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. దవాఖానలు, మెడికల్‌ షాపులను మినహాయించి మిగతా షాపులన్నీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మూసివేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రజలు ఉదయమే పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుందని వర్తక సంఘం నాయకులు పేర్కొన్నారు.logo