గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jul 10, 2020 , 00:42:38

24 గంటల్లో ‘కోకట్‌ వాగు’ మరమ్మతులు

24 గంటల్లో ‘కోకట్‌ వాగు’ మరమ్మతులు

  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 
  • భారీ వర్షాలతో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి పరిశీలన

 తాండూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దశాబ్దాల కిందట నిర్మించిన యాలాల మండలం కోకట్‌ వాగు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఏ సమయంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ బ్రిడ్జిని గురువా రం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటల్లో కోకట్‌ సమీపంలోని బ్రిడ్జికి మరమ్మతులు ప్రారంభిస్తామనిపే ర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా వాగుపై వంతెన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు సం బంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ఇతర మార్గం నుంచి రాకపోకలు జరుపాలని సూచించారు. అదేవిధంగా తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నానది నూతన వంతెన నిర్మాణం పనులు కూడా ప్రారంభిం చి త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌ గుప్తా, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, ఎంపీటీసీ పురుషోత్తంరావు, సర్పంచ్‌ శంకర్‌రెడ్డి, నేతలు అక్బర్‌బాబా, శ్రీనివాస్‌రెడ్డి, నయీం, విఠల్‌నాయక్‌, ఆశన్న పాల్గొన్నారు.


logo