బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jul 08, 2020 , 23:23:55

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు

ధారూరు : గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను, ఇంకుడు గుంతలను త్వరగా నిర్వహించు కోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్‌ గ్రామంలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్లను, ఇంకుడు గుంతలు, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. అనంతరం పల్లెప్రగతిలో జరిగిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపైకి మురికి నీరు పోకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతల్లోకి వెళ్లే విధంగా చూడాలన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకొని హరితహా రం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ధారూ రు ఎంపీడీవో అమృత, ఎంపీవో మున్నయ్య, సర్పంచు సుజాత వెంకట్‌ రాంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.


logo