శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jul 07, 2020 , 23:33:39

హరితహారం.. దేశానికే ఆదర్శం

హరితహారం..  దేశానికే ఆదర్శం

  • ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దాం..
  • రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి
  • మంత్రులు  సబితారెడ్డి, తలసాని 
  • తుక్కుగూడలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

తుక్కుగూడ : సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న హరితహారం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సీనిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కేంద్రం సమీపంలో షీఫ్‌బ్రీడింగ్‌ ఫార్మ్‌ ఆవరణలో 55ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీష్‌, డైరీ తదితర శాఖల అధికారులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఐదు విడుతలుగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం వల్ల మంచి ఫలితాలున్నాయని గుర్తు చేశారు. హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. రోడ్లకు ఇరువైపుల అనువుగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటాలని సూచించారు. 

స్వచ్ఛమైన గాలి, పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా ప్రకృతిలో విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డా. లక్ష్మారెడ్డి, తెలంగాణ పశుగణాభివృద్ధిశాఖ సీఈవో డా. మంజువాణి, విజయడైరీ ఎండీ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బారావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.విజయకుమార్‌ రెడ్డి, మహేశ్వరం తాసిల్ధార్‌ జ్యోతి, తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, కౌన్సిలర్స్‌ లావణ్యరాజు ముదిరాజ్‌, రెడ్డిగళ్ల సుమన్‌, బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్‌, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పశుగ్రాస వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.


logo