బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jul 07, 2020 , 23:33:37

గ్రంథాలయాలకు ఆధునిక హంగులు

గ్రంథాలయాలకు ఆధునిక హంగులు

  • రూ.4కోట్లతో బడంగ్‌పేటలో  లైబ్రరీ  
  • సకల  సౌకర్యాలతో జిల్లా కేంద్ర గ్రంథాలయం 
  • సిరిసిల్ల తరహాలో నిర్మించేందుకు సన్నాహాలు 
  • జిల్లాలో చేవెళ్ల,శంషాబాద్‌, శేరిలింగంపల్లి లలో కొత్తవి నిర్మాణం
  • అనేకచోట్ల పునర్నిర్మాణానికి ఏర్పాట్లు 
  • విద్యార్థులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
  • ఇప్పటికే 23 చోట్ల సొంత భవనాలు

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడానికి  ఆధునిక హంగులతో, వినూత్న సొబగులతో గ్రంథాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి       జిల్లా  మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేటలో రూ.4కోట్లతో నిర్మించేందుకు ఇటీవల మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. సిరిసిల్ల తరహాలో అన్నివర్గాల అనుకూలంగా ఉండేలా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. జిల్లాలో మొత్తం 24 లైబ్రరీలు ఉండగా 23చోట్ల సొంత భవనాలు ఉన్నాయి.   కందుకూరు, మహేశ్వరం లైబ్రరీలలో అదనపు గదులు నిర్మించనున్నారు.  జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో మొత్తం 3,020,25 పుస్తకాలు ఉన్నాయి. 20,533 మంది రెగ్యులర్‌ సభ్యులు ఉన్నారు. వనస్థలిపురం, మంచాల, షాద్‌నగర్‌, ఆమనగల్లు,  చేవెళ్ల, శంషాబాద్‌, శేరిలింగంపల్లి తదితర చోట్ల అన్ని సౌకర్యాలతో గ్రంథాలయాలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పుస్తక పఠనం ఒక ఆరోగ్యకరమైన అలవాటు. టెక్నాలజీ యుగంలో పుస్తకాల్ని బతికించడం కోసం ఇదొక చిరుప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు పుస్తక ప్రియులు. స్మార్ట్‌ఫోన్‌, ఐఫోన్‌లకే పరిమితమైన ప్రస్తు త పరిస్థితుల్లో పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లా ప్రజలకు గ్రంథాలయం సాహితి, చర్చాగోష్ఠులకు వేదిక కావాలని సాహితీప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ఉద్యమ వ్యూహం, రాజకీయ చతురతతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిపారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత 2016 ఏప్రిల్‌ 14న రంగారెడ్డి జిల్లాలో నూతనంగా జిల్లా గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా సరూర్‌నగర్‌లోని శాఖా గ్రంథాలయంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం జిల్లా పరిపాలన విభాగం నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఆరు గ్రామీణ గ్రంథాలయాలు, 59 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 14 మంది రెగ్యులర్‌ సిబ్బంది, ముగ్గురు పొరుగు సేవల సిబ్బంది, 11మంది పార్ట్‌ టైం వర్కర్స్‌ విధు లు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సహాయ, సహకారాలతో పార్లమెంట్‌, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సూచనలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి చేశా రు. మారుతున్న కాలంతోపాటు గ్రంథాలయాలను అధునీకరించాలని... ప్రతి ప్రధాన గ్రంథాలయంలో అంతర్జాల సేవలను, కం ప్యూటర్‌ సేవలను ఉచితంగా చదువరులకు అందించాలన్న సంకల్పంతో అవసరమైన పుస్తకాలను (పోటీ పరీక్షలకు, దిన, మాస పత్రికలు, పీరియాడికల్స్‌) ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలన్న నిర్ణయంతో అడుగులు పడుతున్నాయి.

జిల్లాలోని అన్ని గ్రంథాలయాల లో మొత్తం 3,020,25 పుస్తకాలు ఉన్నాయి. 20,533 మంది రెగ్యులర్‌ సభ్యులు ఉన్నారు. 23సొంత భవనాలు ఉన్నాయి. జిల్లాలో కేవలం ఒక్క గ్రంథాలయాన్ని మాత్రమే అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. 2019-20 సంవత్సరానికిగాను గ్రంథాలయ పన్ను రూపేణా రూ. 9కోట్లకు పైగా వసూలయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్‌ పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు రూ. 4కోట్లు కేటాయించి అధునాతన హంగులతో సకల సౌకర్యాలతో పుస్తకప్రియులకు ఉపయోగకరం గా, మహిళలకు, చిన్నారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని విభాగాలను నిర్మిస్తున్నారు. అలాగే ఎల్బీనగర్‌ నియోజకవర్గం వనస్థలిపురంలో రూ.56 లక్షలతో శాఖ గ్రంథాలయం పునర్‌ నిర్మాణం జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో మంచాలలో రూ.43 లక్షలతో శాఖ గ్రంథాలయా న్ని నిర్మిస్తున్నారు. 

జిల్లాలోని రాజేంద్రనగర్‌ నియోజకవర్గం శంషాబాద్‌లో శిథిలమైన శాఖ గ్రంథాలయాన్ని తొలగించి కోటి రూపాయలకు పైగా వెచ్చించి నూతన గ్రంథాలయాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో షాద్‌నగర్‌ పట్టణంలో గల గ్రేడ్‌-1 గ్రంథాలయం జీర్ణావస్థలో ఉండడంతో.. దాన్ని కూల్చివేసి ఆ స్థానంలో దాదాపు రూ.2 కోట్లతో నూతన గ్రంథాలయాన్ని నిర్మించనున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లులో గల శాఖా గ్రంథాలయం జీర్ణావస్థలో ఉన్నందున కూల్చివేసి అదే స్థానంలో రూ.కోటి నిధులతో నూతన శాఖ గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో జీర్ణావస్థలో ఉన్న శాఖా గ్రంథాలయం స్థానంలో అత్యాధునికంగా సౌకర్యవంతంగా పుస్తక ప్రియులకు ఉపయోగకరంగా ఉండేలా రూ. కోటికి పైగా నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టడానికి, అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా గ్రంథాలయ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తున్నారు. ఇక్కడ సైతం దాదాపు రూ.2కోట్ల రూపాయలతో అత్యాధునిక పద్ధతిలో నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం శాఖ గ్రంథాలయాలలో అదనపు గదుల నిర్మా ణం, మూత్రశాలలు ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా నిర్మాణం చేపట్టబోయే అన్ని గ్రంథాలయాలను మోడల్‌ గ్రంథాలయాలుగా నిర్మించనున్నారు. 

అత్యాధునికంగా అన్ని రకాల సదుపాయాలతో..

జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అత్యాధునికంగా అన్ని రకాల సదుపాయాలతో నిర్మిస్తున్నాం. గ్రంథాలయాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌లో జిల్లా కేంద్ర లైబ్రరీ ఉండేదని, జిల్లాల పునర్విభజనతో కేంద్ర లైబ్రరీని అన్ని నియోజకవర్గాలకు మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. జిల్లాలో నూతనంగా రూ.4 కోట్ల రూపాయల నిధులతో సిరిసిల్లలో నిర్మించినట్లు జిల్లా లైబ్రరీని నిర్మాణాలకు పునాది రాయివేశాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని వసతులతో కూడిన లైబ్రరీలను నిర్మిస్తాం.

- సబితారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

అన్ని హంగులతో..

విద్యార్థులు, నిరుద్యోగ యువత, చిన్నపిల్లలు, పెద్దలు చదివే అన్ని రకాల పుస్తకాలు లైబ్రరీలలో ఏర్పాటు చేస్తున్నాం. వారంతా వీటిని వినియోగించుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారి కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆధునికంగా సీనియర్‌ సిటిజన్లు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక వసతులతో గ్రంథాలయాలను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

- కప్పాటి పాండురంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌


logo