శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jul 06, 2020 , 23:56:59

రైతు సమస్యల పరిష్కారానికి కృషి

రైతు సమస్యల పరిష్కారానికి కృషి

  • కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్‌
  • గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం

కేశంపేట : గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్‌ అన్నారు. మండలంలో ని సంగెంలో సోమవారం నూతనంగా నిర్మించిన డంపింగ్‌యార్డును ప్రారంభించి, కొత్తపేట, కేశంపేట, లేమామిడిలలో రైతు వేదిక భవనాల నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి..

వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని, రైతులకు ప్రభుత్వం మరింతగా సేవలు అందించేందుకు రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం డంపింగ్‌ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రేణుక, నవీన్‌కుమార్‌, వెంకట్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్‌, ఎంపీటీసీలు మల్లేశ్‌యాదవ్‌, యాదయ్యచారి, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ జమాల్‌ఖాన్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అం జిరెడ్డి, ఏడీఏ రాజారత్నం, ఇన్‌చార్జి ఎంపీడీఓ గణపతి, ఎంపీఓ ఉదయ్‌శంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మురళీధర్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, విశ్వనాథం, వెంకటయ్య, శ్రీశైలం, మధుసూదన్‌రెడ్డి, మల్లేశ్‌, మురళీమోహన్‌ పాల్గొన్నారు.


logo