బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jul 06, 2020 , 02:28:06

చేరువలో చేయూత రుణాలు

చేరువలో చేయూత రుణాలు

  • తాండూరు పట్టణంలో పూర్తైన వీధి విక్రయదారుల జాబితా
  • ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు 
  • రుణాల కోసం బ్యాంకులకు నివేదిక 

తాండూరు టౌన్‌ : వీధి విక్రయదారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆత్మ నిర్భర్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. మున్సిపల్‌ ఆధ్వర్యం లో అర్హులైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారులకు భరోసా కల్పిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్‌లో వీధి విక్రయదారులను గుర్తించి తుది జాబితాను ఖరారు చేశారు. తాత్కాలిక ఆవాసాలపై, తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారితో పాటు చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను సిద్ధం చేశా రు. అంతేకాకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాం కులకు నివేదికలను అందించడంతో వీధి వ్యాపారులకు చేయూత రుణాలు చేరువ కాబోతున్నాయి.

1573 మంది వ్యాపారుల గుర్తింపు...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్‌ మెప్మా సిబ్బంది తాండూరులో వీధి వ్యాపారుల సర్వే చేపట్టారు. గతంలో చేపట్టిన సర్వేలో 578 మంది మాత్రమే ఉండగా ఆత్మ నిర్భర్‌ పథకానికి 1420 మందిని గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరులో సర్వే పూర్త య్యే నాటికి లక్ష్యానికి మించి 1573 మంది వ్యాపారులను గుర్తించారు. వీరితో పాటు 153 మంది ఇతర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటివరకు ఖరారు చేసిన జాబి తా ఆధారంగా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను కూడా సిద్ధం చేస్తున్నారు. గుర్తించిన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

మహిళా సంఘాల తరహాలో రుణాలు

మహిళా సంఘాల తరహాలో వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ. 10వేల చొప్పున రుణాలు అందించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐదు లేదా పది మంది సభ్యులతో గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల్లో ఖాతాను తెరిచి దాని ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. రూ. 10వేల రుణం మంజూరు చేస్తే లబ్ధిదారులు ప్రతినెల రూ. 946ల చొప్పు న 12 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి సబ్సిడీ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా డిజిటల్‌ విధానంలో రుణాలు చెల్లించిన వారికి ప్రతినెల క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది. 

రుణాల కోసం బ్యాంకులకు నివేదిక

 ఆత్మ నిర్భర్‌ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు ము న్సిపల్‌, పోలీసు, వైద్యం, న్యాయవాదులు, వీధి విక్రయదారుల సంఘాల బృందంతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పా టు చేశారు. ఈ కమిటీ ద్వారా గుర్తించిన వారికి పట్టణంలోని ఏడు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసేలా మెప్మా సిబ్బంది నివేదిక సిద్ధం చేశారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ(ఏడీబీ), దేనాబ్యాంకు, విజయబ్యాంకు, కెనరా బ్యాంకు, దక్కన్‌ గ్రామీణ బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాలు ఉండగా ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని నివేదిక అందజేశారు. నేడో, రేపో మిగతా బ్యాంకులకు నివేదికను అందజేయనున్నారు. దీంతో పాటు పట్టణంలో లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఆయా బ్యాంకులకు ఆర్జీలను సమర్పించారు. ఇందు కు ఆయా బ్యాంకులు సమ్మతిస్తే వారికి కూడా రుణాలు మంజూరు చేస్తారు.

చిరువ్యాపారుల స్థితిగతులు మెరుగు

అర్హులైన వీధి వ్యాపారులందరికీ లబ్ధి చేకూరాలని పట్టణం లో పకడ్బందీ సర్వే చేపట్టామ న్నారు. అందుకు తగ్గట్లు గు ర్తింపు కార్డులను అందించబోతున్నాం. ప్రతి సంఘంలో ఒక్కొక్కరికీ మంజూరయ్యే రూ. 10వేల రుణాలతో వ్యాపారుల ఆర్థిక స్థితిగతులు మె రుగవుతాయి. వీధి వ్యారులు ఆత్మ నిర్భర్‌ కింద మంజూరయ్యే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 

  - స్వప్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌logo