శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jul 06, 2020 , 01:22:17

ముగిసిన అనంతగిరి చిన్నజాతర

ముగిసిన అనంతగిరి చిన్నజాతర

వికారాబాద్‌ రూరల్‌ : ఆషాఢమాసంలో అనంతగిరి చిన్నజాతర ఉత్సవాలు ఆదివారం పెరుగు బసంతం కార్యక్రమంతో ముగిశాయి. గత నెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు పౌర్ణమితో ముగిశాయని, వారం రోజులు ప్రత్యేక పూజలు చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. కుండతో పెరుగు, కోనేటి నీటిని తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజల అనంతరం గరుడ స్తంభం ఎక్కి కుండను పగులగొట్టడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. పగిలిన కుండ ముక్కలు తీసుకెళ్ల్లి రైతుల వారి పొలాల్లో ఉంచడం ద్వారా పంటలు బాగా పండుతాయని నమ్మకం. జాతర సందర్భంగా భక్తులను లోనికి అనుమతించకపోవడంతో బయటి నుంచే స్వామి వారికి మొక్కారు. సెలవురోజు కావడంతో పర్యాటకులు వచ్చి ఆహ్లాదంగా గడిపి వెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు logo