ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jul 01, 2020 , 22:51:08

కేఎల్‌ఐ సాధనలో పెద్దన్న పాత్ర పోషించాలి

కేఎల్‌ఐ సాధనలో పెద్దన్న పాత్ర పోషించాలి

  • ఎమ్మెల్సీ కసిరెడ్డికి సాధన సమితి వినతి

ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయించి ఈ ప్రాంత రైతాంగానికి సాగు జలాలు అందించడంలో పెద్దన్న పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధన సమితి సభ్యులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అందులో భాగంగానే డీ-82 పథకం కింద నిధులు మంజూరు చేసి, కల్వకుర్తిలోని జంగారెడ్డిపల్లి వరకు సాగు నీరందించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కల్వకుర్తి రైతాంగానికి నూరు శాతం న్యాయం జరిగేలా చూస్తానన్నారు. మంత్రుల సహకారంతో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి త్వరలోనే అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పనులు పూర్తయ్యేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, సాధన సమితి సభ్యులు లక్ష్మణ్‌శర్మ, లింగంగౌడ్‌, సర్దార్‌నాయక్‌, యాదిలాల్‌, తిరుపతి, నాయకులు జంగయ్య, రఘురామ్‌, భాస్కర్‌రెడ్డి, బాబా, నర్సింహ పాల్గొన్నారు.


logo