సోమవారం 23 నవంబర్ 2020
Vikarabad - Jul 01, 2020 , 22:49:31

కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్‌

కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్‌

కడ్తాల్‌: మండల కేంద్రంలోని వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌ను కొనసాగిస్తున్నారు. కడ్తాల్‌ మండలం చుట్టుపక్కల ఉన్న మండలాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని దుకాణాదారులు లాక్‌డౌన్‌  పాటిస్తున్నారు. దవాఖానలు, మెడికల్‌ షాపులు మినహా, మిగతా దుకాణాలన్నీ ఉదయం 11 గంటల తర్వాత మూసేస్తున్నారు. పట్టణ ప్రజలందరూ బుధవారం ఉదయమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఇంట్లోనే ఉంటున్నారు. కడ్తాల్‌లో ఈ నెల 13 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతుందని వర్తక సంఘం నాయకు లు తెలిపారు.